తెలంగాణా

నిజాముల పాలనలో తెలంగాణా ప్రాంతం , మెదక్ మరియు వరంగల్ డివిజన్ లు కల హైదరా బాద్ రాష్ట్రానికి చెందినదిగా వుండేది. తర్వాత అది ఆంద్ర ప్రదేశ్ లో ఒక భాగం అయ్యింది. జూన్ 2 వ తేదీ 2014 సంవత్సరం నాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భ వించింది. హైదరాబాద్ నగరం తెలంగాణాకు రాజధానిగా కొనసాగుతోంది. 

       

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 [ఫిబ్రవరి 20] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.

అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు

భౌగోళిక స్వరూపం

ఈ ప్రాంతము దక్కను పీఠభూమిపై, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. దక్కన్ పీఠభూమిలో భాగమైన ఈ ప్రాంతము సరాసరిన 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణా కు దక్షిణమున ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తరమున గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున తెలంగాణా మరియు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు వేరుచేయుచండగా, ఆదిలాబాదు జిల్లా పూర్తిగాను, వరంగల్లు మరియు ఖమ్మం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు గోదావరికి ఉత్తరాన ఉన్నవి.

           

చరిత్ర ప్రధాన  

ఈ ప్రాంతము మూడవ శతాబ్దంలో శాతవాహనులు, తరువాత కాకతీయులు, తరువాత బహుమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, మొఘలు పరిపాలకులు, నిజాం సుల్తానులు పరిపాలించినారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చు నాటికి ఈ ప్రాంతము నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత తెలంగాణా పోలీసు చర్య ద్వారా ఇది స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యంలో కలపబడినది, ఈ పోరాటంలో తెలంగాణా సాయుధ పోరాటంనాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించినది. తరువాత 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన ద్వారా అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడు వారితో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించినది.

                                        

తెలంగాణ - సాంస్కృతిక రంగం

బమ్మెర పోతన (శ్రీమద్ భాగవత తెలుగు అనువాదకులు) వంటి ప్రసిద్ధ రచయితలు, కవులు, ఇతర కళాకారులు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చారు. తెలంగాణా లో కల కొన్ని ప్రాంతీయ పండుగలలో బోనాలు, బతుకమ్మ మరియు సమ్మక్క సారాలమ్మ జాతర వంటివి ప్రసిద్ధి. దసరా, గణేష్ చతుర్ధి, ఉగాది వంటి పండుగలు కూడా ఇక్కడి ప్రజలు వైభవోపేతంగా ఆచరిస్తారు. రాష్ట్రంలోని ఆహారాలు ఏమిటి? తెలంగాణా లో రెండు రకాల ఆహారాలు కలవు. తెలుగు వంటకాలు మరియు హైదరాబాద్ వంటకాలు.

తెలంగాణా జిల్లాలు

ప్రస్తుత తెలంగాణా ప్రాంతమునందు ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు అను 10 జిల్లాలు కలవు.

భౌగోళిక మార్పులు

స్వాతంత్రానంతరం, వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం , దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణా ప్రాంతంలోని భాగంగానే చూపించబడుతున్నది.

తెలంగాణ - ఆహారాలు

తెలుగు వంటలు వివిధ సుగంధ ద్రవ్యాల ఘాటైన రుచుల వంటలు కాగా, హైదరాబాద్ వంటకాలు లో తెలుగు మరియు ఇతర దేశాలు అంటే అరబ్, టర్కిష్, మరియు మొగలాయీ వంటకాల సమ్మేళనం రుచులు కలిగి వుంటాయి. తెలంగాణ లో టూరిజం దక్షిణ భారత దేశంలో తరచుగా పర్యటించే ప్రదేశాలు తెలంగాణా లో కలవు. హైదరాబాద్ లోని చార్మినార్, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ మరియు కుంతల వాటర్ ఫాల్స్ , వరంగల్ లోని యాదగిరి గుట్ట, బాసర లోని సరస్వతీ దేవాలయం వంటివి వాటిలో కొన్ని. ఈ రాష్ట్రంలో ఇంకనూ భద్రాచలం టెంపుల్, వేయి స్తంభాల టెంపుల్, శ్రీ రాజ రాజేశ్వర స్వామీ టెంపుల్ వంటివి కూడా కలవు.

Road Map

రాష్ట్రం లో రవాణా వ్యవస్థ ఎలా వుంటుంది? రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ పర్యాటకులకు సౌకర్యవంతంగా వుండి ఇండియా లోని ఇతర రాష్ట్రాల నుండే కాక, ఇతర దేశాల వారు కూడా తేలికగా పర్యటనలు చేసేది గా వుంటుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ఇతర రాష్ట్రాల పర్యాట కులకే కాక, ఇతర దేశాల విమాన సర్వీస్ లకు కలుపబడి వుంది. రైల్వే మరియు రోడ్డు మార్గాలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలు పర్యటించేందుకు అనుకూలంగా వుంటాయి.

telangana_history
endaro-_mahanubhavulu